Saturday, December 24, 2016

ఫస్ట్ టైం శృంగారం చేస్తే..మగాళ్ళకు కష్టమా..?


ఫస్ట్ టైం శృంగారం చేస్తే..మగాళ్ళకు కష్టమా..?



తొలి అనుభ‌వం ఎవ‌రిక‌యినా.. ఏ ప‌నిలో అయినా టెన్ష‌నే. అది జాబ్ కావొచ్చు. కాలేజ్‌లో జాయినింగ్ కావొచ్చు.. అలాంటిదే సెక్స్ కూడా అంటున్నారు నిపుణులు. అందులోనూ తొలి అనుభవం అంటే అంద‌రికీ ఆవిష‌యంలో ఎంతో ఆస‌క్తి, భ‌యం, ఉత్సుక‌త‌తో పాటు ఎన్నో ర‌కాల అనుభూతులు ఉంటాయి. అయితే, మ‌గాళ్లు ఎలాంటి అనుభ‌వం లేకుండా డైరెక్టుగా శోభనం గదిలోకి అడుగుపెడితే ఎలా ఉంటుంది….ఎంత కండ‌లు తిరిగిన మ‌గాడైనా కాస్త బెరుకుగానే ఉంటాడు. అయితే పై బెరుకు సంగ‌తి అలా ఉంచితే అస‌లు ప‌నిలోకి వెళితే ఎంత వ‌ర‌కు త‌న భార్య‌ను తొలి రాత్రి సంతృప్తి ప‌రుస్తామా అన్న డౌట్ సహ‌జంగానే అంద‌రికి ఉంటుంది. అయితే దీనిపై ఓ ఓ కెనెడియన్‌ సర్వే షాకింగ్ విష‌యాలు చెప్పింది.
సెక్స్‌లో ఎలాంటి అనుభ‌వం లేని మ‌గాళ్లు డైరెక్టుగా శోభ‌నం గ‌దిలోకి వెళ్లి త‌మ భార్య‌తో శోభ‌నం చేసిన వారిపై జ‌రిపిన ఈ స‌ర్వేలో ప‌లు అంశాలు వెల్ల‌డ‌య్యాయి. మొదటి సెక్స్ అనుభవం ఎలా సాగింది? మీ విషయంలో భాగస్వామి సంతృప్తి చెంది ఉంటుందని అనుకుంటున్నారా అని దాదాపుగా 3,500 మంది పురుషులని అడిగితే, అందులో 76% మంది సంతృప్తిపరచలేదని సమాధానమిచ్చార‌ట‌.అయితే వీరు త‌మ భాగ‌స్వామిని సంతృప్తి ప‌ర‌చ‌లేక‌పోవ‌డానికి కార‌ణాలు కూడా చెప్పార‌ట‌. కొంతమంది ఓరల్ సెక్స్ చేయలేకపోయామని చెబితే, భయంగా అనిపించిందని, మొహమాటపడ్డానని, తనకి నొప్పి కలిగిస్తానేమొ అనే కంగారని, తన శరీరం గురించి అవగాహన లేక అని మరికొందరు సమాధానం చెప్పారు.
మ‌రి కొంద‌రు మాత్రం హ‌స్త ప్ర‌యోగం అల‌వాటు ఉన్నా, పోర్న్ బాగా చూస్తాన‌ని, సెక్స్ యాంగిల్స్ బాగా తెలుస‌ని చెప్పినా అనుభ‌వం లేక తొలి రాత్రి ఫెయిల్ అయ్యామ‌ని చెప్పార‌ట‌. మ‌రి కొంద‌రు మాత్రం తొలిసారి శృంగారం అంటే విపరీతమైన అంచనాలు పెట్టుకుంటారేమో అమ్మాయిలు. అందుకే నా భార్య అంచనాలను అందుకోలేక‌పోయాన‌ని చెప్పార‌ట‌. సో దీనిని బ‌ట్టి అనుభ‌వం లేని మ‌గాళ్లు తొలి రాత్రి త‌మ భార్య‌ల‌ను అంత సంతృప్తి ప‌ర‌చ‌లేర‌న్న‌మాట‌. ఇందుకోసం ముందుగా వారిని తెలివిగా మోటివేట్ చేస్తే సంతృప్తి ప‌ర‌చ‌వ‌చ్చ‌ని సెక్సాల‌జిస్టులు చెపుతున్నారు.

No comments:

Post a Comment